విలియమ్‌సన్‌ సరసన కోహ్లి

17 Mar, 2021 11:34 IST|Sakshi

అహ్మదాబాద్ : ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో వీరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా విలియమ్‌సన్‌ పేరిట ఉన్న అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ 20లో ప్రస్తుతం కోహ్లి ,విలియమ్‌సన్‌ 11 అర్ధ సెంచరీలతో సమంగా ఉన్నారు. మంగళవారం అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడవ టీ20 లో కోహ్లి కేవలం 46 బంతుల్లో 77 పరుగులు (నాటౌట్) చేసి  ఈ ఘనతను సాధించాడు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అంతరాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో 3000 పరుగుల చేసిన మొదటి క్రికెటర్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు . టీ 20లో 138.96 స్ట్రైక్ రేట్‌తో  సగటున 52.17 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ 20 లో కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ వీరిద్దరు తొమ్మిది అర్ధ సెంచరీలు సాధించి కోహ్లీ ,విలియమ్‌సన్‌ తర్వాతి స్థానంలో ఉన్నారు.

మూడో టీ20లో భారత బ్యాట్స్‌మెన్‌ తడబాటు 
పవర్‌ప్లేలోనే  24 పరుగులకు 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌కు  కోహ్లి తన ఇన్నింగ్స్‌ ద్వారా గౌరవప్రదమైన స్కోర్‌ను ఇంగ్లాండ్‌ ముందు ఉంచాడు. ప్రత్యేకంగా మార్క్ వుడ్ వేసిన 18 వ ఓవర్లో 6, 6, 4 పరుగులు చేసి డెత్‌ ఓవర్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌ను మరో సారి ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. కోహ్లీ ( 77),  రిషబ్ పంత్ (25) చివర్లో హార్దిక్ పాండ్యా (17)  మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. 

Read latest Cricket News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు