కొన్ని విషయాలను తేలిగ్గా తీసుకోం: కోహ్లీ

12 Mar, 2021 23:48 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా, నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం ‍విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాము. అనుకున్న షాట్లను సరిగ్గా ఆడలేకపోయాం’ అని అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో పక్కా ప్లాన్‌తో తిరిగివస్తామని తెలిపాడు. బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ విజయం సులువైందని చెప్పాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్కడే మంచి ప్రదర్శన చేసినా మిగతా బ్యాట్స్‌మన్లు పూర్తిగా విఫలమయ్యారని కోహ్లి తెలిపాడు.ఆట‌లో గెలుపు, ఓటములు సహజమేనని తర్వాతి మ్యాచ్‌కు సరైన ప్రణాళికతో తిరిగివస్తామని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు కేవలం ఐదు టీ20 మ్యాచ్‌లే ఉండగా, ఈ సమయంలో ప్రయోగాలు  చేసిన, కొన్ని విషయాలను మాత్రం తేలిగ్గా తీసుకోలేమని వివరించాడు. టీమిండియా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి చేధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. (చదవండికోహ్లి కథ ముగిసినట్టేనా..!)

Read latest Cricket News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు