వారసుడొచ్చాడని ఆనందపడ్డారు.. కానీ వారం రోజుల తర్వాత..

22 Mar, 2022 08:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వారం రోజులకే నూరేళ్లు నిండాయి..

వైద్యుడి నిర్లక్ష్యం వల్లే పసికందు మృతి

బాధితుల ఫిర్యాదు మేరకు వైద్యుడిపై కేసు

సాక్షి,మంచిర్యాలక్రైం: ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మూడో సంతానంగా బాబు జన్మించడంతో వారసుడొచ్చాడనే ఆనందం కలిగింది. వారం రోజులకే ఆ బాబుకు నూరేళ్లు నిండడం వారికి గుండెకోత మిగిల్చింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే బాబు మృతిచెందాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యుడిపై కేసు నమోదైన సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు సోమవారం చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామగుండం పోలీసు కమిషనరేట్‌ కంట్రోల్‌ రూంలో విధులు నిర్వర్తిస్తున్న సీఐ అల్లం నరేందర్‌ భార్య నాగలక్ష్మి ఈ నెల 13న మంచిర్యాలలోని ప్రైవేటు నర్సింగ్‌లో మూడో కాన్పులో ఏడు నెలలకే బాబుకు జన్మనిచ్చింది.

వైద్యురాలి సలహా మేరకు స్థానిక పిల్లల ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. బాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చికిత్స అందించారు. ఆదివా రం రాత్రి పరిస్థితి విషమించిందని, కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లేలోపు బాబు మృతిచెందినట్లు తెలిపారు. వైద్యుడి నిర్లక్ష్యంతో బా బు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించా రు. పుట్టినరోజు నుంచి చికిత్స అందించిన వైద్యుడు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఇవ్వలేదని, వైద్య పరీక్షలు, పూర్తిస్థాయిలో పరికరాలు లేకపోవడం ప్ర ధాన కారణమని పేర్కొన్నారు. వైద్యుడి నిర్లక్ష్యం వ ల్లే మృతిచెందాడని, అందుకు కారణమైన డాక్టర్‌ కుమార్‌వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ సోదరుడు రాజేష్‌వర్మ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈవిషయమై స్థానిక సీఐ నారాయణ్‌ నాయక్‌ను సంప్రదించగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు