ముగ్గురు స్నేహితుల లైంగిక దాడి.. 10 ఏళ్ల బాలుడు మృతి

1 Oct, 2022 16:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సీలాంపుర్‌ ప్రాంతంలో ముగ్గురు బాలురు తన స్నేహితుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాధిత 10 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు వెల్లడించేందుకు తొలుత కుటుంబ సభ్యులు నిరాకరించగా.. పోలీసుల కౌన్సిలింగ్‌తో జరిగిన దారుణాన్ని వివరించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 18న బాధిత బాలుడిపై ముగ్గురు మైనర్‌ స్నేహితులు లైంగికంగా వేధించారు. దాడి జరిగిన మూడు రోజులకు బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా బాలుడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. కౌన్సిలింగ్‌ ఇచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లి వివరించింది. 

అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు కొన్ని రోజులు చికిత్సకు స్పందించినా.. శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఇద్దరు జువైనల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, తల్లిదండ్రుల హామీతో వారిని విడుదల చేయాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఆదేశించింది. మరో బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పోక్సో, ఐపీసీ సెక్షన్‌ 377,34 ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన మైనర్లు సైతం 10-12 ఏళ్ల వారేనని వెల్లడించారు.

ఇదీ చదవండి: వైద్యులు బతకడన్నారు.. ఇప్పుడు 18వ బర్త్‌డే చేసుకుంటున్నాడు!

మరిన్ని వార్తలు