ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్‌ తీస్తుండగా షాక్‌ తగిలి చిన్నారి మృతి

29 Nov, 2022 10:30 IST|Sakshi

సాక్షి, గద్వాల్‌: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్‌ తీస్తుండగా షాక్‌ తగిలి నిహారిక అనే చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా పదేళ్ల నిహారిక 4వ తరగతి చదువుతుంది. కూతురు అకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ పరికరాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. సెల్‌ఫోన్‌లు, ఈ-వాహనాలు పేలుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ఈ క్రమంలో చార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడవద్దని, పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు

మరిన్ని వార్తలు