దారుణం: పదేళ్ల బాలికపై అత్యాచారం.. వీడియో చిత్రీకరణ

11 Jun, 2021 14:48 IST|Sakshi

చంఢీగఢ్‌: హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. రేవారి అనే గ్రామంలో ఓ ఖాళీ పాఠశాల భవనంలో పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు బాలికను గ్రామంలోని ఓ ఖాళీ పాఠశాల భవనానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిపారు. ఈ నేరాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారని పేర్కొన్నారు. కాగా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బాలిక కుటుంబం జూన్ 9న పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. 

ఇక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఐదుగురు మైనర్లు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.  5వ తరగతి చదువుతున్న బాలికను తన ఇంటి బయట ఆడుతుండగా నిందితులు ఆమెను కిడ్నాప్ చేసినట్టు వెల్లడించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి నిందుతులను అరెస్ట్‌ చేశారు.

చదవండి: విషాదం: కుటుంబ కలహాలతో ఐదుగురు కుమార్తెలు సహా...

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు