బోటులో వంద కేజీల హెరాయిన్‌

26 Nov, 2020 05:18 IST|Sakshi
నౌక నుంచి భారత తీర గస్తీ దళం స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌

శ్రీలంక నుంచి పాక్‌ తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు

సాక్షి, చెన్నై/మల్కాపురం (విశాఖ పశ్చిమ): శ్రీలంకకు చెందిన ఓ బోటు ద్వారా పాకిస్తాన్‌కు రవాణా చేస్తున్న వంద కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది. తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలో ఈ నెల 17 నుంచి తొమ్మిది రోజుల పాటు నావికాదళ విన్యాసాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విన్యాసాలలో భాగంగా భారత నావికాదళం ఒక శ్రీలంక బోటును గుర్తించింది. అనుమానం వచ్చి ఆ బోటును పట్టుకొని అందులో ఉన్న ఆరుగురు సిబ్బందిని ప్రశ్నంచగా.. వారు   హెరాయిన్‌ను పాకిస్తాన్‌కు తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. వీటిని పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు అమ్ముతారని తెలిసింది. 99 ప్యాకెట్ల హెరాయిన్‌ను, 20 చిన్న పెట్టెల సింథటిక్‌ డ్రగ్స్‌ను, ఐదు 9 ఎంఎం పిస్టళ్లను, ఒక శాటిలైట్‌ ఫోన్‌ సెట్‌ను గస్తీ దళం స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతోంది.

 

మరిన్ని వార్తలు