12 ఏళ్ల రష్యా బాలికపై అఘాయిత్యం

12 May, 2022 16:40 IST|Sakshi

Goa Police has arrested a  Room attendant: అత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమైపోతున్నాయే తప్ప అంతుపొంతు లేకుండా పోతోంది. ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్నిచట్టాలు తీసుకచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. కామాంధులు చిన్నపిల్లలు, పసికందు అనే జాలి దయ లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే గోవాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...నార్త్ గోవాలోని అరాంబోల్‌లోని హోటల్‌ రిసార్ట్‌లో 12 ఏళ్ల రష్యన్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అకృత్యానికి పాల్పడింది ఆ రిసార్ట్‌లో పనిచేస్తున్న రూమ్‌ బాయ్‌ అని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందుతుడి రవి లమానిని అతని సొంతూరు కర్ణాటకలోని గడగ్‌లో అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు.

ఈ మేరకు ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ నాయక్‌ మాట్లాడుతూ...బాధితురాలి తల్లి తన కుమార్తెను స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద వదిలి మార్కెట్‌ నుంచి అవసరమైన వస్తువులు తీసుకురావడానికి వెళ్లినపుడు ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. అని చెప్పారు. 

(చదవండి: నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్‌.. షాక్‌లో పేరెంట్స్‌, వరుడు)

మరిన్ని వార్తలు