బీటెక్‌ రవికి 14 రోజుల రిమాండ్‌: జైలుకు తరలింపు

4 Jan, 2021 09:54 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : 2018లో పులివెందుల అల్లర్ల కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు సోమవారం పులివెందుల మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. బీటెక్‌ రవికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయన్ని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా,  2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్‌ రవిపై వారెంట్‌ పెండింగ్‌లో ఉండింది. ( రామతీర్థం ఘటన: డబ్బులు పంచిన టీడీపీ)

 రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో ఇన్నాళ్లూ అరెస్ట్‌ కాకుండా, బెయిల్‌ తీసుకోకుండా బీటెక్ రవి తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో జరిగిన రాళ్ల దాడిలో ఎస్‌ఐ చిరంజీవికి గాయాలయ్యాయి. హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేథప్యంలో ఆదివారం చెన్నై విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు