తల్లి వివాహేతర సంబంధం; బాలుడిపై ఫిర్యాదు!

22 Jan, 2021 17:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నాగ్‌పూర్‌: తల్లితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కిడ్నాప్‌న‌కు యత్నించి పోలీసులకు చిక్కాడు మహారాష్ట్రకు చెందిన 15 ఏళ్ల బాలుడు. నాగ్‌పూర్‌కి చెందిన బాలుడు మరో ఇద్దరు స్నేహితుల సాయంతో తన తల్లి ప్రియుడిని అపహరించి బైక్‌పై తీసుకెళ్లే క్రమంలో, బాధితుడు తప్పించుకోవడంతో విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్జీ హౌస్ చౌక్‌ అనే ప్రాంతంలో ఒంటరిగా నివాసముంటున్న బాలుడి తల్లి, ప్రదీప్ నందన్వర్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై ఆమె, ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో కలత చెందిన బాలుడు తన తల్లి ప్రియుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నందన్వర్‌ కిడ్నాప్‌నకు కుట్ర పన్నాడు. 

ఈ క్రమంలో ముగ్గురు యువకులు కలిసి నందన్వర్‌ పని చేసే కార్యాలయం నుంచి అతన్ని అపహరించి బైక్‌పై తీసుకెళ్తుండగా, ఓ ప్రాంతంలో పోలీస్‌ పెట్రోలింగ్ వాహనం కనపడటంతో నందన్వర్‌ రన్నింగ్‌ బైక్‌ నుంచి దూకేశాడు. పోలీసులను గమనించిన యువకులు నందన్వర్‌ను వదిలేసి పరారయ్యారు. నిందితుల నుంచి తప్పించుకున్న నందన‍్వర్‌ బాలుడి తల్లికి సమాచారం చేరవేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరం అంగీకరించారు. ఆ ముగ్గురు యువకులకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు