దారుణం: ఒక్క పదం తప్పు రాశాడని చితకబాదిన టీచర్‌...విద్యార్థి మృతి

26 Sep, 2022 19:15 IST|Sakshi

లక్నో: పరీక్షలో ఒకే ఒక్కపదం తప్పురాసినందుకు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌరియా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథన ప్రకారం నిఖిత్‌ దోహ్రే అనే దళిత బాలుడు స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. సెప్టంబర్‌ 7న సోషల్‌ ఎగ్జామ్‌లో ఒక పదం తప్పురాశాడని ఉపాధ్యాయుడు అశ్విన్‌ సింగ్‌ కర్రలు, రాడ్‌ తోటి అత్యంత హేయంగా కొట్టాడు.

దీంతో ఆ విద్యార్థి స్పృహ తప్పిపోయాడు. తల్లిదండ్రులు ఇటావా జిల్లాలోని ఆస్పత్రికి తరలిస్తుండగా ...ఆ విద్యార్థి మృతి చెందాడు. అదీగాక సదరు ఉపాధ్యాయుడు బాధితుడి తండ్రికి చికిత్స నిమిత్తం డబ్బులు కూడా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాదు ఆ బాలుడిని కులం పేరుతో దూషిస్తూ.. కొట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఆ బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి నిగమ్‌ తెలిపారు. నిందితుడు ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

(చదవండి: భర్తను చితకబాది..భార్యపై ఆరుగురు గ్యాంగ్‌ రేప్‌)

మరిన్ని వార్తలు