ఏడేళ్ల బాలికపై బాలుడి లైంగికదాడి..

14 Jan, 2021 08:32 IST|Sakshi

 ఘాతుకానికి పాల్పడింది బాలుడు 

పోక్సో చట్టం కింద కేసు నమోదు

చుండూరు (వేమూరు): ఏడేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగికదాడికి యత్నించిన ఘటన గుంటూరు జిల్లా చుండూరు మండలం పెదగాదెలవర్రులో మంగళవారం చోటుచేసుకుంది. పెదగాదెలవర్రుకు చెందిన దంపతులకు ఏడేళ్లు, ఐదేళ్లు వయస్సు ఉన్న ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె ఆ గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. చిన్న కుమార్తె అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతోంది. వీరి ఇంటి పక్కనే ఉన్న 16 ఏళ్ల బాలుడు కొల్లూరు మండలం చిలుమూరు హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు స్వగ్రామం పెదగాదెలవర్రు వచ్చాడు. మంగళవారం అతని అక్క కాలేజీకి, తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు బ్యాంకు పని నిమిత్తం మండల కేంద్రం చుండూరు వెళ్లారు. చదవండి: కిరాతకం: వివాహం కావడం లేదని.. 

బాలిక, ఆమె చెల్లెలు మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా వారిని బాలుడు గమనించాడు.  ఇంట్లోకి తీసుకెళ్లి పెద్దపాపపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే, ఆ బాలిక అతడిని విదిలించుకుని ఇంటికి పరుగెత్తుకెళ్లింది. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి రాగానే బాలిక చెల్లెలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు బాలుడి ఇంటి వద్దకు వెళ్లి జరిగిన విషయంపై నిలదీశారు. దీంతో బాలుడిని అతని తండ్రి కొట్టి మందలించడంతో ఇంటి నుంచి పరారయ్యాడు. అనంతరం బాలిక తల్లిదండ్రులు మంగళవారం రాత్రి చుండూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ పిల్లి శ్రావణి విషయాన్ని తెనాలి డీఎస్పీ స్రవంతిరాయ్‌కు తెలియజేయడంతో బాలిక ఇంటి వద్దకు ఆమెతో పాటు చుండూరు సీఐ బి. రమేష్‌బాబు, ఎస్‌ఐ శ్రావణి వెళ్లి విచారించారు. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా, డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బాలుని ఆచూకీ కోసం పోలీసులు, బాలుడిని తల్లిదండ్రులు గాలిస్తున్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు