బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసు: ఉప్పలపాటి హిమబిందు అరెస్ట్

5 Aug, 2021 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రూ.1700 కోట్ల బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో ఉప్పలపాటి హిమబిందును ఈడీ అరెస్ట్‌ చేసింది. వీఎమ్‌సీ సిస్టమ్స్‌ కంపెనీ డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించి పలు బ్యాంకుల నుంచి రుణాలు పొందిన సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలతో పంజాబ్‌ నేషనల్ బ్యాంకు నుంచి రూ.539 కోట్లు.. ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.1207 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీఎమ్‌సీ కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లపై కేసు నమోదైంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ముగ్గురు డైరెక్టర్లు ఉప్పలపాటి హిమబిందు, రామారావు, రమణపై కేసు నమోదు చేసింది. ఉప్పలపాటి హిమబిందును అరెస్ట్ చేసి, మిగిలిన ఇద్దరికి లుక్‌ అవుట్ నోటీసులు ఇచ్చింది.
 

మరిన్ని వార్తలు