షాకింగ్‌ ఘటన: వీడియో కాల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ... ఒంటికి నిప్పంటించుకున్నాడు...

6 Sep, 2022 18:28 IST|Sakshi

ముంబై: 19 ఏళ్ల యువకుడు తన గర్లఫ్రెండ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడతూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన సబర్బన్‌ శాంతాక్రూజ్‌లోని బాధితుడి నివాసంలోనే చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.....బాధితుడుని సాగర్‌ పరుశురామ్‌ జాదవ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను 30 శాతం కాలిన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

జాదవ్‌ సోమవారం అర్థరాత్రి గణపతి విగ్రహాన్ని సందర్శించి వచ్చిన తర్వాత ఒక నిర్ధిష్ట రహదారిపై తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో  గొడవపడ్డాడు. తదనంతరం తన నివాసంలో గర్లఫ్రెండ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడతూ నిప్పంటించుకుంటానని బెదిరించాడు. ఐతే ఇంతలో ఆ నిప్పు కాస్త అతని కాటన్‌ షర్ట్‌కి అంటుకుని మంటలు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టాయి. అంతే జాదవ్‌ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అప్రమత్తమై.. ఆ మంటలను ఆర్పేసి అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐతే జాదవ్‌ మాత్రం విచారణలో ఈ ఘటనకు ఎవరు బాధ్యులు కారని చెప్పడం గమనార్హం. 

(చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు