నకిలీ ఇన్‌వాయిస్‌లతో 19.1 కోట్లు విత్‌డ్రా 

8 Jan, 2021 08:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌లో వెలుగుచూసిన నకిలీ ఇన్‌వాయిస్‌ల కుంభకోణం మరువక ముందే అదే తరహాలో రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్‌లోనూ ఓ మోసం వెలుగు చూసింది. ముఖేశ్‌ కుమార్‌ గోయల్, సంజయ్‌ జోషి, రాహుల్‌ అగర్వాల్‌ అనే ముగ్గురు మనుగడలో లేని కంపెనీలను సృష్టించి, సరుకు రవాణా చేసినట్లు నకిలీ ఇన్‌వాయిస్‌లతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందారు. అంతేకాకుండా ప్రీతం ఫుట్‌వేర్, రాజేశ్‌ ఫుట్‌వేర్, యోగేశ్‌ ఫుట్‌వేర్‌ సంస్థలు జారీ చేసిన నకిలీ జీఎస్టీ ఈ–వే బిల్లుల సాయంతో దాదాపు రూ. 32.54 కోట్ల విలువైన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందేందుకు ప్రణాళిక రచించారు. అందులో రూ. 19.1 కోట్లను రీఫండ్‌ రూపంలో పొందినట్లు జీఎస్టీ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిని అరెస్టు చేశారు. కోర్టు వారికి ఈ నెల 21 వరకు రిమాండ్‌ విధించింది. 

మరిన్ని వార్తలు