వరద: లిఫ్ట్‌ డోర్లు మూసుకుపోవటంతో.. 

24 Sep, 2020 12:40 IST|Sakshi
నతానీ రెసిడెన్సీ

ముంబై : డోర్లు మూసుకుపోయిన లిఫ్ట్‌లోకి వరద నీరు చేరుకోవటంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. ఈ సంఘటన ముంబైలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, కాలా పానీ జంక్షన్‌లోని నతానీ రెసిడెన్సీ‌ బిల్డింగ్‌లో జీమీర్‌ సోహన్‌, శెహజాద్‌ మీమన్‌లు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారు ఉంటున్న బిల్డింగ్‌ బేస్‌మెంట్‌ ఫ్లోర్‌లో నీళ్లు చేరసాగాయి. అది తెలియని ఇద్దరూ వాటర్‌ ట్యాంక్‌ మోటర్‌ ఆన్‌ చేయటానికి బేస్‌మెంట్‌కు వెళ్లారు. మెల్లమెల్లగా వరద నీళ్లు బేస్‌మెంట్‌ను నింపటం గమనించి, వచ్చిన లిఫ్ట్‌లోనే వెనక్కు వెళ్లటానికి ప్రయత్నించారు. పై ఫ్లోర్‌కు వెళ్లటానికి లిఫ్ట్ నెంబర్లు నొక్కారు. ( వెలుగుచూస్తున్న కైలాస్‌ నాయక్‌ లీలలు..)

అయితే డోర్లు క్లోజ్‌ అయ్యాయి కానీ, లిఫ్ట్‌ పైకి పోలేదు. ఎమర్జన్సీ అలారం మోగించారు. అలారం విన్న బిల్డింగ్‌లోని కొందరు అక్కడికి చేరుకుని వారిని బయటకు లాగే ప్రయత్నం చేసినప్పటికి, లాభం లేకపోయింది. ఆ వెంటనే వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాసక సిబ్బంది అక్కడికి చేరుకుని లిఫ్ట్‌ను కత్తిరించి ఇద్దర్నీ బయటకు తీశారు. అయితే అప్పటికే వరద నీటిలో మునిగిపోయిన ఆ ఇద్దరు ఊపిరాడక చనిపోయారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు