దారుణం: తండ్రి శవం పక్కనే 3 రోజులుగా చిన్నారులు..

17 Jun, 2021 14:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా, భర్త ఉరి వేసుకుని చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. నోయిడాలో మనోజ్‌ దయాల్‌ తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి 4, 6 ఏళ్ల వయస్సున్న ఇద్దరు ఆడపిల్లలు. కరోనా వలన గత కొన్ని రోజులుగా మనోజ్‌ దయాల్‌ ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో తరచుగా గొడవలు జరిగేవి. దీంతో విసిగిపోయిన మనోజ్‌ భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మనోజ్‌ తన ఇద్దరు బిడ్డలను చూసుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో మనోజ్‌ కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో, ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే, పాపం..  తండ్రి చనిపోయాడనే విషయం తెలియని ఆ బిడ్డలు.. నాన్నను ఎంత పిలిచిన పలకడం లేదని ఆకలి వేయడంతో ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పడికే మూడు రోజుల నుంచి ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదని చుట్టుపక్కల వారు అనుమానంగా చూశారు.  ఇంతలోనే​ పిల్లలు బయటకు వచ్చి మానాన్న .. మాట్లాడటం లేదని చుట్టుపక్కల వాళ్లకు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆ ఇంటికి వెళ్లి చూశారు. అయితే, అప్పటికే మనోజ్‌ ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు.

అతని, శవం నుంచి దుర్వాసన వెలువడుతుంది. దీంతో చిన్నారులు మూడు రోజులు నుంచి శవంతోనే ఉన్నారని వారు భావించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బారేల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాన్ని వైద్యపరీక్షల కోసం తరలించారు. కాగా, కేసును నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతామని తెలిపారు. ఆ చిన్నారులిద్దరిని వారి బంధువులకు అప్పగించామని రోహిత్‌ సింగ్‌ అనే పోలీసు అధికారి పేర్కొన్నారు.

చదవండి: షాకింగ్‌: తల్లి శవాన్ని కొరుక్కుతిన్న రాక్షస కుమారుడు 

మరిన్ని వార్తలు