ఇన్‌స్టంట్‌ లోన్‌ ముఠా గుట్టు రట్టు... నిర్వహించేది చైనావాళ్లే!

21 Aug, 2022 13:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇన్‌స్టంట్‌ లోన్‌ దోపిడి మాయను బట్టబయలు చేశారు ఢిల్లీ పోలీసులు. సుమారు రెండు నెలలపాటు సాగిన ఈ గ్యాంగ్‌ అపరేషన్‌ పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్‌ నెట్‌వర్క్‌ విస్తరించి ఉందని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....లక్నోలోని కాల్‌ సెంటర్లలో ఉన్న ఈ ముఠా తొలుత చిన్నమొత్తాల్లో రుణం అందించడానికి దరఖాస్తులు కోరుతుంది. ఆ తర్వాత యూజర్‌ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్‌ చేసి యాప్‌కు అనుమతులు మంజూరు చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారి ఖాతాలో రుణం జమ అవుతుంది.

అంతేకాదు ఫేక్‌ ఐడీలపై సేకరించిన వివిధ నంబర్ల నుంచి వినియోగదారులకు ఫోన్‌ చేసి ఒత్తిడి చేయడం మొదలు పెడతాయి. ఒకవేళ పట్టించుకోకపోతే వారి ఫోటోలను మార్ఫింగ్‌ చేసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరింపులకు దిగుతుంది. దీంతో బాధితులు భయంతో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతోంది.

ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ ముఠా హవాల ద్వారా లేదా క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసి చైనాకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రతి ఖాతాకు కోటి రూపాయాల పైనే డబ్బులు జమ అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ  మేరకు దాదాపు 500 కోట్ల ఇన్‌స్టంట్‌ లోన్‌  దోపిడి రాకెట్‌తో ప్రమేయం ఉన్న సుమారు 22 మందిని అరెస్టు చేశారు.

అంతేకాదు ఈ దందా కోసం ఆ ముఠా  దాదాపు వంద లోన్‌యాప్‌లను ఉపయోగించనట్లు వెల్లడించారు. నిందుతుల నుంచి 51 మొబైల్ ఫోన్లు, 25 హార్డ్ డిస్క్‌లు, తొమ్మిది ల్యాప్‌టాప్‌లు, 19 డెబిట్ కార్డ్‌లు/క్రెడిట్ కార్డ్‌లు, మూడు కార్లు, సుమారు రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా జాతీయులు సూచనల మేరకే ఈ రాకెట్‌ని తాము నిర్వహిస్తున్నామని నిందితులు చెప్పనట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసుల చైనాకు చెందిన కొంతమంది దుండగులను గుర్తించామని, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు