ఘోరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై.. కజిన్‌ అత్యాచారం

16 Oct, 2021 20:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిందితుల్లో ఎక్కువశాతం బాధిత యువతులకు తెలిసినే వారు ఉండటం గమనార్హం. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మైనర్‌ బాలికపై సమీప బంధువు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జరిగి రెండు నెలలు అవుతుండగా తాజాగా  వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే..
చదవండి: గొడవ ఆపాలని​ ప్రయత్నించిన పోలీసు ముఖంపై.. 

ఢిల్లీలోని కోట ముబార్క్‌పుర్‌లోని బాపు పార్క్‌లో మైనర్‌ 15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లి యూపీలోని తల్లిగారి ఇంటికి వెళ్లగా.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. అదే సమయంలో బాపు పార్క్‌లోనే నివసించే 22 ఏళ్ల కజిన్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. అయితే ఇటీవల తల్లి ఊరు నుంచి తిరిగి రావడంతో బాధితురాలు జరిగినదంతా ఆమెకు చెప్పింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: కూతురు ప్రియుడితో కనిపించడంతో రోడ్డుపైనే..

మరిన్ని వార్తలు