ఘోర ప్రమాదం: 23 మంది మృతి

3 Jan, 2021 16:28 IST|Sakshi

ఘజియాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో  భవనం కూలి సుమారు 23 మంది వరకూ మృత్యువాత పడ్డారు. మురాద్‌నగర్‌ శ్మశానవాటిక కాంప్లెక్స్‌లో పైకప్పు కూలిపోయింది.  రామ్‌ ధాన్‌ అనే వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడానికి 25మందికి పైగా శ్మశానానికి వెళ్లారు. కాగా, ఆ సమయంలో వర్షం రావడంతో వారంతా శ్మశానంలో ఉన్న కాంప్లెక్స్‌లో వెళ్లగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు అక్కడిక్కడే మరణించగా, కొంతమంది ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: అడ్వాన్స్ ఇవ్వలేదని ప్రయాణికురాలి పీక కోశాడు..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు