అయ్యో పాపం.. విస్మయ ఎలా చనిపోయిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

22 Jun, 2021 20:58 IST|Sakshi

కొల్లాం: కేరళ రాష్ట్రంలో వరకట్న వేధింపులకు బలైన 23 ఏళ్ల యువతి ఘటన చర్చనీయాంశంగా మారింది. కుందనపు బొమ్మ లాంటి ఆ అమ్మాయిని అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధించిన చిత్రహింసలు చివరకు ఆమె చావుకు కారణమైంది. కడక్కల్ లోని కైతోడ్ కు చెందిన ఎస్.వి. విస్మయ సోమవారం(జూన్ 21) ఉదయం వాష్ రూమ్ లో ఊరి వేసుకొని కనిపించింది. తొలుత అందరూ ఆత్మహత్యాగా భావించినప్పటికి తర్వాత తన సోదరుడికి పంపిన మెసేజ్‌లు, ఫొటోలు బయటపడటంతో అత్తింటి వారే ఆమెను హింసించి చంపినట్టుగా ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అత్తింట్లో ఆమె పడిన క్షోభ అంతా ఇంతా కాదని ఆ ఫొటోలను చూస్తే మనకు స్పష్టం అవుతుంది. ఈ చిత్రాలలో ఆమె ముఖం, చేతులపై గాయాలు ఉన్నాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాం జిల్లా సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన ఎస్ కిరణ్ కుమార్‌కు, విస్మయ వి నాయర్(23) అనే యువతికి మార్చి 2020లో పెద్దల సమక్షంలో వివాహమైంది. అల్లుడు మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండటంతో కూతురిని సంతోషంగా చూసుకుంటాడని విస్మయ తల్లిదండ్రులు కట్నకానుకలు బాగానే ముట్టజెప్పారు. అతనికి కట్నం కింద 100 సెవిరీల బంగారం, ఎకరానికి పైగా భూమి, టయోటా యారిస్ కారును కట్నంగా అల్లుడికి ఇచ్చారు. పెళ్లి అయిన కొద్ది రోజుల తర్వాత హింసించడం మొదలు పెట్టాడు. కిరణ్ తనకు కట్నంగా ఇచ్చిన కారుకు బదులుగా నగదు కావాలని పట్టుబట్టాడు.

అతను ఇంతకు ముందు కూడా ఆమెపై దాడి చేసినట్లు తమకు తెలుసునని విస్మయ తండ్రి వర్ధిల్లికమాన్ నాయర్ చెప్పారు. "ఒకసారి అతను ఆమెతో ఇంటికి వచ్చాడు, అందరూ పార్టీ తర్వాత తాగి ఉన్నారు. వారు ఇంటికి చేరుకున్న తర్వాత అతను ఆమెను కొట్టాడు, నా కుమారుడు దాని గురించి అడగడానికి వెళ్ళినప్పుడు, కిరణ్ అతనిని కూడా కొట్టాడు. మేము వెంటనే పోలీసులను ఆశ్రయించాము. అయితే, సర్కిల్ ఇన్ స్పెక్టర్ కిరణ్, మా కుటుంబం మధ్య రాజీ కుదిర్చారు. ఈసారి వదిలేయండి అని తన కుమారుడు చెప్పడంతో ఆ తర్వాత నుంచి నా కుమార్తె మా ఇంట్లోనే ఉంది. కానీ రెండు నెలల క్రితం, ఆమె బీఎఎమ్ఎస్ పరీక్షలు రాయడానికి కళాశాలకు (పండలంలో) వెళ్ళినప్పుడు, కిరణ్ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు, ఆ తర్వాత నుంచి ఆమె ఇంటికి రాలేదు" అని వర్ధిల్లికమాన్ నాయర్ చెప్పారు.

ఆ తర్వాత నుంచి విస్మయ తన తల్లిని మాత్రమే కాల్ చేసేది, తండ్రికి లేదా సోదరుడకి కాల్ చేసేది కాదు. తన తల్లితో భర్త కిరణ్ రోజు హింసించే వాడని, రోజు కొడుతున్నడని ఆమె వాళ్ల అమ్మకు చెప్పది. ఈ విషయం గురుంచి సోదరుడికి, తండ్రికి చెప్పవద్దు అన్నట్లు కూడా చెప్పింది. చాలా రోజుల పాటు నరకయాతన అనుభవించిన విస్మయ చనిపోయే రెండు రోజుల ముందు సరిగ్గా జూన్ 19న తన కజిన్‌కు భర్త కిరణ్ తనను ఎంత వేధిస్తున్నాడో మెసేజ్ చేసింది. తనను జుట్టు పట్టుకుని ఈడ్చి ముఖంపై కొట్టాడని తనకు అయిన గాయాలను చూపిస్తూ ఫొటోలు పంపింది. తనను కిరణ్ కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని తాను కూడా ఎవరికీ చెప్పలేదని ఆ మెసేజ్‌ల్లో విస్మయ తెలిపింది.

సరిగ్గా రెండు రోజులకే ఆమె అత్త ఇంటి నుంచి విస్మయ తల్లిదండ్రులకు ఫోన్ వెళ్లింది. విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమెను ఆసుపత్రికి తరలించామని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. విస్మయ సోదరుడు విజిత్ పీ నాయర్ భాదతో ఇది ఒక హత్య అని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. స్థానిక పోలీసులు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితురాలి సోదరుడు ఆమె ఎదుర్కొన్న వేధింపులకు సంబంధించి మహిళ చిత్రాలు, వాట్సప్ సంభాషణలను పోలీసులకు సమర్పించాడు. ఈ కేసుపై వెంటనే నివేదిక సమర్పించాలని కొల్లం గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ)ని మహిళా కమిషన్ కోరింది. మహిళ కుటుంబం ఎంచుకున్న ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కూడా చేయాలని మహిళా కమిషన్ సభ్యురాలు షాహిదా కమల్ చెప్పారు.

చదవండి: బైక్‌తో బీటెక్‌ విద్యార్థి బీభత్సం.. 8 నెలల నిండు గర్భిణిని

మరిన్ని వార్తలు