మహిళ ఒత్తిడితో 24 ఏళ్ల యువకుడి ఆత్మహత్య

24 Jul, 2021 16:46 IST|Sakshi
పత్రీకాత్మక చిత్రం

ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని అలీగ‌ఢ్ ముస్లిం యూనివ‌ర్సిటీ (ఏఎంయూ) హాస్ట‌ల్‌లో 24 ఏళ్ల టీచ‌ర్ ఉరి వేసుకుని మ‌ర‌ణించ‌డం క‌ల‌క‌లం రేపింది. బాధితుడు అలీగ‌ఢ్‌లోని ఏఎన్‌సీ కాలేజ్‌లో అధ్యాప‌కుడిగా ప‌నిచేస్తున్న అభిషేక్ కుమార్ స‌క్సేనాగా పోలీసులు గుర్తించారు. స‌క్సేనా గురువారం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించాడు. అభిషేక్‌ గత వారం రోజులుగా తన వ‌స‌తి గృహాన్ని ఖాళీ చేసి హాస్ట‌ల్ గ‌దిలో ఉంటున్నాడు. అయితే ఆగ్రాకు చెందిన ఓ మహిళ ఒత్తిడి కారణంగానే అభిషేక్‌ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

‘అభిషేక్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డే స‌మ‌యంలో ఒక మ‌హిళ‌తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఆమె నా సోదరుడిని బ్లాక్‌మెయిల్ చేసింది’ అని బాధితుడి సోద‌రుడు ఆరోపించారు. యూపీలోని ఫిలిబిత్ అభిషేక్ స్వ‌స్ధ‌ల‌మ‌ని పోలీసులు తెలిపారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేష‌న్‌లో బాధితుడి కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు చేయడంతో సెక్షన్‌ 306 కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని సివిల్ లైన్స్ ఎస్‌హెచ్‌ఓ రవీంద్ర కుమార్ దుబే తెలిపారు.

మరిన్ని వార్తలు