290 కోట్ల భారీ కుంభకోణం.. 9 మంది అరెస్ట్‌

13 Jun, 2021 19:50 IST|Sakshi

బెంగళూరు: హవాలా రాకెట్‌కు సంబంధించి రూ. 290 కోట్ల మనీలాండరింగ్ కుంభకోణాన్ని బెంగళూరు సైబర్ పోలీసులు శనివారం నలుగురు విదేశీ పౌరులతో సహా తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..  రేజింగ్ పే సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సమాచారం అందడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గేమింగ్, సోషల్, ఇ-కామర్స్ విభాగాలలో ఈ ఆన్‌లైన్ హవాలా రాకెట్‌ను గుర్తించినట్టు తెలిపారు. కాగా నిందితుల్లో ఇద్దరు చైనా పౌరులు, ఇద్దరు టిబెటన్ జాతీయులు ఉన్నట్లు పోలీసులు​ పేర్కొన్నారు. కాగా ప్రధాన నిందితుడు అనాస్ అహ్మద్‌గా గుర్తించినట్టు తెలిపారు.  చైనా హవాలా ఆపరేటర్లతో అనాస్‌కు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

అసలు ఏంటి ఈ హవాలా రాకెట్:
పవర్ బ్యాంక్ అనే చైనీస్ అప్లికేషన్‌లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందంటూ జనాలకు ఆశ కలిగించారు. ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ఎంచుకున్నారు. కాగా కొంతకాలం తర్వాత వారి వ్యాపారాన్ని ఎత్తివేశారు.

చదవండి: 4,000 కిలోల మామిడి పండ్లు ద్వంసం.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు