పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

7 Mar, 2021 09:54 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : జంగారెడ్డిగూడెం బైపాస్‌లోని శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాతపడగా.. 20 మందికి గాయాలయ్యాయి. ఓ ఇద్దరి పరిస్థితి విషయమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్‌ని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు