వివాహితపై అత్యాచారం.. స్పృహ కోల్పోయి:!

5 Nov, 2020 12:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రామచంద్రపురం పోలీస్‌ స్టేషన్‌లో సమీపంలో కొల్లూరు తండాకు చెందిన వివాహిత ప్రేమలత అనే మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో స్పృహ కోల్పోయిన మహిళను అనంతరం హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళను రెండు రోజుల క్రితమే హత్య చేయగా మియాపూర్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అదే రోజు మధ్యాహ్నం కొల్లూరు సమీపంలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు మధు, చందూలాల్‌, కుటుంబరావులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: సూసైడ్‌ నోట్‌: నా చావుకు వారే కారణం..!

కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లంబాడి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆర్‌సీ పీఎస్‌ ముందు ఆందోళన చేపట్టారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని మియాపూర్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పన్నెండేళ్ల క్రితం భర్తను కూడా హత్య చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కూతురు హత్యకు భూ వివాదమే కారణమని బాధితురాలి తల్లి, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు