ఆకతాయి ఆలోచన.. సరదాగా సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌

7 Aug, 2021 15:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల అదుపులో ముగ్గురు బాలురు 

హిమాయత్‌నగర్‌: సరదాగా ట్యాంక్‌బండ్‌పైకి షికారుకు వచ్చిన ఆ ముగ్గురు మైనర్లకు ఆకతాయి పని చేయాలనే ఆలోచన తట్టింది. ట్యాంక్‌బండ్‌పై ఏదైనా ఆకతాయి పనిచేస్తే దొరికితే కొడతారనే భయం వేసింది. దీంతో ఈ నెల 5న హిమాయత్‌నగర్‌ లిబర్టీ రోడ్డువైపు వచ్చారు. అదే సమయంలో అంబర్‌పేటకు చెందిన బాలకృష్ణ కరీంనగర్‌ నుంచి లిబర్టీ వద్దకు వచ్చాడు. బస్సులు రాకపోవడంతో సెల్‌ఫోన్‌ నుంచి క్యాబ్‌ బుక్‌ చేసుకుంటున్నాడు.

ఇదే సమయంలో కామాటిపురాకు చెందిన 16 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు బాలురు ద్విచక్రవాహనంపై వచ్చారు. బాలకృష్ణ చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కుని పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించిన డిఎస్‌ఐ చందర్‌సింగ్‌ సీసీ పుటేజీల ఆధారంగా కేవలం 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకు

మరిన్ని వార్తలు