దారుణం: చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి..

6 Apr, 2021 17:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సిరిసిల్ల: మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన సిరిసిల్ల మున్సిపల్‌ పరిధి భూపతినగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భూపతినగర్‌కు చెందిన బూర్ల చంద్రశేఖర్‌ ఎదురింట్లో ఉంటున్న మూడేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటికి చిన్నారి కేకలు వేయగా, తల్లి వచ్చి చూసేసరికి తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా లైంగికదాడి జరిగిందని డాక్టర్లు తెలిపారు.

చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చిన్నారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు చంద్రశేఖర్‌ ప్రవర్తనతో పాటు, గతంలో నేరారోపణలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు సోమవారం ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. స్థానికులతో మాట్లాడి నివేదిక తయారు చేశారు.  

చదవండి: షాకింగ్‌: వివస్త్రలుగా మారి బాల్కనీలోకి వచ్చిన మహిళలు.. ఆపై

మరిన్ని వార్తలు