పండగ వేళ విషాదం..కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఆగిన తండ్రి గుండె

3 Oct, 2022 14:43 IST|Sakshi

పూణె: దసరా ఉత్సవాలు దేశమంతటా అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆయా సంప్రదాయాల రీత్యా డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అచ్చం ఇలానే ఆనందోత్సహంతో పండుగా చేసుకుంటూ ఒక వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో పాల్ఘర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...35 ఏళ్ల మనీష్‌ నీరాప్జీ సోనిగ్రా గ్లోబల్‌ సిటీలోని విరార్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న గర్బా ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఆ రోజు రాత్రి ఆనందంగా చిందులేస్తూ ఉన్నటుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సదరు వ్యక్తి తండ్రి అతన్ని హుటాహుటిని ఆస్పత్రికి తరలించగా... అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు మరణ వార్త విన్న సదరు వ్యక్తి తండ్రి అక్కడికక్కడే  కుప్పకూలి చనిపోయాడు. దీంతో పోలీసులు ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలుగా కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

(చదవండి: విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి.. ఒకరిని కాపాడబోయి ఒకరు)

మరిన్ని వార్తలు