తప్పుడు పోస్టులు పెట్టిన నలుగురి అరెస్టు

17 Oct, 2020 17:59 IST|Sakshi

సాక్షి, కాకినాడ: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన నలుగురిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితులంతా కోనసీమకు చెందిన జనసేన కార్యకర్తలుగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయిం అస్మీ మీడియాతో మాట్లాడుతూ.. పడమటి పాలెం సత్తెమ్మ తల్లి ఆలయం గుడి మెట్ల వద్ద పడి ఉన్న రెయిలింగ్‌ గురించి పూర్తిగా తెలియకుండా నిందితులు వాట్సప్‌ స్టేటష్‌ పెట్టి తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు.

సెప్టిక్‌ ట్యాంక్‌ లారీ ఆలయం వద్ద ఆగి ఉన్నపుడు లారీ వెనక బంపర్‌ ఢీ కొట్టడంతో రెయిలింగ్‌ పగిలిందని వెల్లడించారు. అది అనుకోకుంగా జరిగిన సంఘటన అని, ఉద్దేశపూర్వకంగా ఎవరూ రెయిలింగ్‌ను పగలకొట్టలేదన్నారు. అయితే నిజనిజాలు తెలియకుండా నిందితులు మత విద్వేషాలు రెచ్చగొట్టెలా స్టేటస్‌లు పెట్టి ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. దీంతో నిందితులను ఇవాళ అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. (సీబీఐ కేసు: రఘురామకృష్ణం రాజు ఔట్)

మరిన్ని వార్తలు