వెలిగల్లు ప్రాజెక్టులో గల్లంతై నలుగురు మృతి

7 Aug, 2021 19:11 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలోని గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టులో గల్లంతై నలుగురు విద్యార్థులు మృతి చెందారు. శనివారం చిత్తూరు జిల్లా వాయల్పాడు, బెంగళూరు ప్రాంతాల నుంచి విద్యార్థి బృందాలు పర్యటనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ప్రాజెక్టులో ఈత కొడుతుండగా వారిలో నలుగురు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురి కోసం స్ధానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను వెలికి తీశారు.

మరిన్ని వార్తలు