420 లీటర్ల సారా స్వాధీనం 

9 Apr, 2022 23:04 IST|Sakshi
గొయ్యి నుంచి సారాబ్యాగులను తీస్తున్న సిబ్బంది  

కంచిలి: మండలంలో నువాగడ పంచాయతీ డొలాసాయి గ్రామంలో 420 లీటర్ల నాటుసారా డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సోంపేట ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ టి.వెంకటప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. చైతన్య భుయా అనే వ్యక్తికి చెందిన ఇంటి పెరడులో సారా బ్యాగులను గుర్తించామని చెప్పారు.

ఒడిశా నుంచి తీసుకొచ్చి ఇక్కడ  భద్రపరిచినట్లు తెలిసిందని, తనిఖీల కోసం సిబ్బంది రావడాన్ని పసిగట్టి భుయా పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో సీఐతో పాటు ఎస్‌ఐలు జి.వి.రమణ, యు.వి.వి.నాగరాజు, హెచ్‌సీ డి.మోహనరావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కాగా, డంప్‌ను గుర్తించినందుకు ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ కంచె శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.పి.గోపాల్‌ సిబ్బందిని అభినందించారు.

మరిన్ని వార్తలు