ఆడుకుంటానని  వెళ్లిన బాలుడు.. అంతలోనే

20 Aug, 2021 14:02 IST|Sakshi

సాక్షి, రుద్రంగి(కరీంనగర్‌): ఆడుకుంటానని చెప్పి వెళ్లిన బాలుడు ట్రాక్టర్‌ ఢీకొనడంతో మృత్యువాత పడిన ఘటన గురువారం చందుర్తి మండలకేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వేములవాడ మండలం మర్రిపెల్లి గ్రామానికి చెందిన రాచర్ల కవిత, నర్సయ్యల కుమారుడు రిషి(5). చందుర్తిలోని అమ్మమ్మ ఇంటికి శుభకార్యానికి వచ్చారు. ఆడుకుంటానని చెప్పి వెళ్లి ఇంటిముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని బాలుని మృతికి కారణమైన ట్రాక్టర్‌ను, డ్రైవర్‌ గామా మహేష్‌ను అదుపులోకి తీసుకొని, బాలుని తండ్రి రాచర్ల నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ గామా మహేష్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై సునీల్‌ తెలిపారు.    

మృతదేహంతో ధర్నా.. 
బాలుడి మృతికి కారణమైన ట్రాక్టర్‌ యజమాని షేక్‌ సల్మాన్‌ ఇంటి ముందు బాలుడి మృతదేహాన్ని ఉంచి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నాచేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకొని నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు