ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. బాలిక కేకలు వేయడంతో!

3 May, 2021 14:06 IST|Sakshi

సాక్షి, కుషాయిగూడ: ఎనిమిదేళ్ల చిన్నారిపై యాభై సంవత్సరాల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుషాయిగూడ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. కాలనీకి చెందిన కొంతమంది మధ్యవర్తులు స్టేషన్‌ వరకు వెళ్లిన బాధితులను పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామంటూ కేసు పెట్టకుండా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం మధ్యవర్తుల కాస్తా ముఖం చాటేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కూతురుపై జరిగిన లైంగిక దాడి ఘటనపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. చర్లపల్లి, ఇందిర గృహకల్ప కాలనీలో నివసించే ఎనిమిది సంవత్సరాల చిన్నారిపై అదే బ్లాక్‌లో నివాసం ఉంటూ టైలర్‌ పని చేసుకునే శ్రీనివాస్‌ (50) అనే వ్యక్తి కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో గత ఆదివారం ఆడుకుందాం రా అంటూ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లిన శ్రీనివాస్‌ పాపను భయపెట్టేలా వ్యవహరించడంతో బాలిక కేకలు వేసింది.

గమనించిన చిన్నారి తల్లిదండ్రులు ఏమైదంటూ పాపను ప్రశ్నించగా విషయం చెప్పింది. తనను తరచుగా ఇలానే చేస్తుంటాడని వాపోవడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు శ్రీనివాస్‌కు దేహశుద్ధి చేశారు. మరుసటి రోజు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కాలనీకి చెందిన ఓ ముగ్గురు మధ్యవర్తులు కేసు పెడితే చాలా రకాల సమస్యలుంటాయని వారిని గందరగోళానికి గురిచేసినట్లు తెలిసింది. బాధితులను పక్కదారి పట్టించిన మధ్యవర్తులు కాస్తా నిందితుడి వద్ద్ద కొంత మొత్తం తీసుకొని పరారీలో ఉంచి కాపాడే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మధ్యవర్తులు కాస్తా ముఖం చాటేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై రేప్, కిడ్నాప్‌ పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ తెలిపారు.  

చదవండి: పెళ్లైన మరుసటి రోజే వరుడి మృతి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు