‘నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలా ఉంది’

27 Jan, 2021 12:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఓ ఉద్యోగిని వేషధారణను అవహేళన చేస్తూ వేధింపులకు పాల్పడిందో మహిళ. హిజ్రాలా ఉన్నావంటూ వెక్కిరిస్తూ ఇబ్బందులకు గురిచేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 36 ఏళ్ల ఓ మహిళ గోరెగావ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. 2020 డిసెంబర్‌లో అదే ప్రాంతలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది. ఆ అపార్ట్‌మెంట్లో‌ నివాసముండే 56 ఏళ్ల మహిళకు ఉద్యోగినికి మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు మహిళ ‘పొట్టి జుట్టు, బట్టలు.. హిజ్రాలా ఉన్నావ్‌’ అంటూ ఉద్యోగినిపై వేధింపులకు దిగేది. దీంతో సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనపై వేధింపులకు పాల్పడుతున్న మహిళపై ఫిర్యాదు చేసింది. దీనిపై శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

బాధితురాలు తన ఫిర్యాదులో ‘‘ నేను అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లోకి వచ్చిన కొత్తలో సదరు మహిళ దగ్గరే టిఫిన్‌ కొనుక్కునేదాన్ని. రుచిగా వండకపోవటంతో ఆమె దగ్గర తినటం మానేశాను. తర్వాత ఆమె కుమారుడితోనూ చిన్న వాగ్వివాదం అయింది. ఆ రోజునుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. అప్పటినుంచి నన్ను వేధించటం మొదలుపెట్టింది. ‘‘ నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలాగా ఉంది’’ అంటూ నీచంగా మాట్లాడేది. నేను ఓ నెల రోజుల పాటు దీన్నంతా భరించాను. ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి నన్ను బూతులు తిట్టేది. స్నేహితుల ముందు అవమానించేది’’ అని పేర్కొంది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు