58 ఏళ్ల వృద్ధుడికి 16 ఏళ్ల బాలికతో వివాహం, కట్‌ చేస్తే..

27 Apr, 2021 10:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కంప్లి(కర్నాటక): బాలికతో పెళ్లికి సిద్ధమైన వృద్ధుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. హంపాదేవినహళ్లి పంచాయతీ పరిధిలోని జీరిగనూరు గ్రామానికి చెందిన 58 ఏళ్ల వృద్ధుడికి   16 ఏళ్ల బాలికను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 23న పెళ్లికి ఏర్పాట్లు చేయగా గుర్తు తెలియని వ్యక్తులు 1098 నంబర్‌కు ఇచ్చిన సమాచారంతో హొసపేటె శిశు అభివృద్ధి యోజన  అధికారి కంప్లి పోలీసు సిబ్బందితో కలిసి వెళ్లి వివాహం రద్దు చేయించారు.

అయితే మరుసటి రోజు పట్టణ సెరుగు గ్రామంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు.  తహసీల్దార్‌ గౌసియాబేగం వెళ్లి వివాహాన్ని అడ్డుకొని వృద్ధుడిని కంప్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి బాల్య వివాహ నిషేద చట్టం కింద కేసు నమోదు చేశారు. 

చదవండి: ఇటు భర్త.. అటు భార్య మిస్సింగ్‌.. తలలు పట్టుకున్న పోలీసులు.. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు