అమానవీయం: మహిళకు లిఫ్ట్‌ ఇచ్చినందుకు.. ఎంత పనిచేశారు..

2 Aug, 2021 20:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గాంధీనగర్‌: గుజరాత్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. తెలిసిన వ్యక్తి.. మోటర్‌ బైక్‌ ఎక్కినందుకు ఆ మహిళను సదరు గ్రామస్థులు సూటిపోటి మాటలతో వేధించారు. అంతటితో ఆగకుండా.. ఆమెకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కూడా అంటగట్టారు. ఈ సంఘటన సబర్కాంత జిల్లాలోని సాంచేరీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హిమ్మత్‌ నగర్‌ పట్టణానికి సమీపంలోని సాంచేరీ గ్రామంలో 30 ఏళ్ల మహిళ జీవిస్తోంది. ఆమెకు నలుగురు పిల్లలు. కాగా, ఆమె భర్త అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తుంది.  

ఈ క్రమంలో ఆమె.. గత నెల జులై 30న హిమ్మత్‌నగర్‌ పట్టణానికి బ్యాంక్ పని మీద వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం తన గ్రామానికి వెళ్తుంది. ఆ సమయంలో ఆమెకు తెలిసిన ఒక వ్యక్తి.. తన మోటర్‌ బైక్‌ ఎక్కాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె తెలిసిన వ్యక్తి అని ఎక్కింది. కాగా, వారిద్దరు కలిసి సాంచేరీ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో కొంత మంది వారిద్దరిని చూసి దూశించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. పాపం.. భర్త చనిపోయిన మహిళ అని కూడా జాలీలేకుండా విచక్షణ రహితంగా అవమానించారు. దీంతో బాధిత మహిళ తీవ్రంగా కుమిలిపోయింది.

ఆరోపణలు చేసిన వారికి సరైన గుణపాఠం చెప్పాలనుకుంది. దీంతో ఆమె గ్రామంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అకారణంగా తనకు వివాహేతర సంబంధం అంటగట్టినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో, స్థానిక పోలీసులు.. వేదాంశి చౌహన్‌, రాజుజీ చౌహన్‌, కలుసిన్హ్‌ చౌహన్‌, రాకేంన్షి చౌహన్‌, సురేఖ చౌహన్‌, సోనాల్‌ చౌహన్‌ లను అదుపులోనికి తీసుకున్నారు. నిందితులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు