రూ. ఆరు లక్షల కుక్క దారుణ హత్య

21 Jun, 2021 21:16 IST|Sakshi
చోటా రాజ

హర్యానా : ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఓ లాబ్రిడార్‌ జాతి కుక్క దారుణ హత్యకు గురైన సంఘటన హర్యానాలోని కర్నల్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నల్‌కు చెందిన సాగర్‌ కొద్ది నెలల క్రితం షేర్‌ ఘర్‌ ప్రాంతంలోని కుక్కలు అమ్మే డీలర్‌ దగ్గరినుంచి మూడు లక్షలు రూపాయలు వెచ్చించి చోటా రాజ అనే లాబ్రిడార్‌ జాతి కుక్కను కొన్నాడు.  పోషకాహారం పెట్టి దాన్ని బలంగా తయారుచేశాడు. ఈ నేపథ్యంలో దాని మాజీ ఓనర్‌ రంగంలోకి దిగాడు.

ఆ కుక్కను ఆరు లక్షలకు అమ్మి సొమ్ము చేసుకుందామని గొడవ చేయటం మొదలుపెట్టాడు. దీంతో సాగర్‌కు, మాజీ ఓనర్‌కు మధ్య గొడవ జరిగింది. కొద్దిరోజుల క్రితం చోటా రాజ కనిపించకుండాపోయింది. ఆదివారం దారుణంగా హత్యకు గురై కనిపించింది. దీంతో సాగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. మాజీ ఓనర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు