రైతు కుటుంబం ఆత్మహత్య

29 Jun, 2021 02:37 IST|Sakshi

సాక్షి బళ్లారి: కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోరం జరిగింది. శహపుర తాలూకా ధోరణహళ్లిలో దంపతులు, నలుగురు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకొన్నారు. గ్రామానికి చెందిన భీమరాయ సురపుర (45), భార్య శాంతమ్మ (36), కుమార్తెలు సుమిత్ర (12), శ్రీదేవి (10), లక్ష్మి (8), శివరాజ్‌ (6) అనే ఆరుగురు సోమవారం తమ పొలంలోని ఫారం పాండ్‌లో దూకి తనువు చాలించారు. భీమరాయ మూడెకరాల పొలం కొనుగోలు చేసి, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు.

మిరప, పత్తి తదితరాల సాగుకు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.20 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా కరువు, అతివృష్టితో పంటలు పండక తీవ్ర నష్టాల పాలయ్యాడు. అప్పుల భారం పెరిగి కుటుంబ పోషణ కూడా కష్టమైంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భీమరాయ సొంత పొలానికి భార్య బిడ్డలను తీసుకెళ్లి మొదట పిల్లలను ఫారంపాండ్‌లోకి తోసేసి, తరువాత దంపతులు దూకినట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు