టాయ్‌లెట్లో రూ.61 లక్షల బంగారం  

26 Feb, 2021 09:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర: మంగళూరు విమానాశ్రయంలో రెండు కేసుల్లో రూ.61 లక్షలు విలువైన బంగారాన్ని అధికారులు సీజ్‌ చేశారు. కేరళ కాసరగోడుకు చెందిన అబ్దుల్‌ రషీద్, అబ్దుల్‌ నిషాద్‌లు ఈ నెల 23న విదేశాల నుంచి చాటుగా బంగారం తీసుకొచ్చి విమానాశ్రయం మరుగుదొడ్డిలో దాచారు. దీనిని గుర్తించి కస్టమ్స్‌ అధికారులు అబ్దుల్‌ రషీద్‌ దాచిన 638 గ్రాముల బంగారం, నిషాద్‌ దాచిన 629 గ్రాముల బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

బెంగళూరులో...  
బెంగళూరులో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఖుర్షీద్‌(41, ఉత్తరప్రదేశ్‌)ను అరెస్ట్‌ చేసి రూ. 61.50 లక్షల విలువైన బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు