హైదరాబాద్‌లో విషాదం: సెప్టిక్‌ ట్యాంక్‌లో పడి బాలుడి మృతి

20 Oct, 2021 18:07 IST|Sakshi
అరవింద్‌(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న సెప్టిక్‌ ట్యాంక్‌లో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడీ కాలనీలో చోటుచేసుకుంది. మంగళవారం నాడు అరవింద్(7) అనే చిన్నారి ఇంటి సమీపంలో గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. అయితే కొద్దిసేపటికి బాలుడు కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు చుట్టుపక్కలా వెతికారు. అయినప్పటికి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్‌ ఎక్కడ?

అయితే ఈ రోజు ఉదయం సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఉన్న బాలుడిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు