గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8మంది దుర్మరణం

9 Aug, 2021 11:19 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌లో ఘోర రోడ్డు  ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. క్రేన్‌ను తరలిస్తున్న సమయంలో ట్రక్కు అదుపుతప్సి గుడిసెలోకి  దూసుకెళ్లిట్లు పోలీసులు గుర్తించారు.

ఘటన జరిగిన సమయంలో గుడిసెలో పది మంది నిద్రిస్తున్నారని, వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఘటనాస్థలిలోనే ఎనిమిది మంది చనిపోయారని, మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారని అమ్రేలి ఎస్‌పీ నిర్లిప్త్‌రాయ్‌ తెలిపారు.  ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పెర్కోన్నారు.

మరిన్ని వార్తలు