8వ తరగతి ప్రేమ.. బాలిక తిరస్కరించిందని ఆమె ఇంట్లోనే..?

11 Aug, 2021 08:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెడు వ్యసనాలకు బానిసగా మారిన బాలుడు

మరదలు వరుసయ్యే బాలికతో ప్రేమ

తనను తిరస్కరించడంతో అమ్మాయి ఇంట్లోనే ఆత్మహత్య

పట్నంబజారు (గుంటూరు జిల్లా): చెడు వ్యసనాలకు బానిసగా మారిన బాలుడు ఓ బాలికను ప్రేమించాడు. ఆ యువతి తిరస్కరించడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అరండల్‌పేట పోలీసుల వివరాల ప్రకారం... బొంగరాలబీడు 1వ లైనుకు చెందిన నల్లమోతు ఆంథోనిబాబు (15) వసంతరాయపురంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.

ఆంథోనికి గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో వరసకు మరదలయ్యే నిరుపేదల కాలనీలో నివసించే ఆమె స్నేహితురాలితో పరిచయం ఏర్పడింది. ప్రేమించమని అడగడంతో ఆ బాలిక తిరస్కరించింది. దీంతో ఆంథోనిబాబు మస్తాపానికి గురై మంగళవారం నిరుపేదల కాలనీలోని మరదలు నివాసంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజారత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు