9 మంది ప్రాణాలు తీసిన నూడిల్స్‌‌

22 Oct, 2020 09:07 IST|Sakshi

బీజింగ్‌ : సంవత్సరం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన న్యూడిల్స్‌ను తిన్న తొమ్మిది మంది కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన చైనాలోని హీలాంగ్జియాంగ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చైనా, హీలాంగ్జియాంగ్‌ నార్త్‌ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌లోని జిసి నగరానికి చెందని ఓ కుటుంబం కొద్దిరోజుల క్రితం.. దాదాపు ఒక సంవత్సరం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన సుఅన్‌టాంగ్జీ ( న్యూడిల్స్‌తో తయారు చేసిన వంటకం)ని తిన్నారు. దీంతో కుటుంబంలోని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తీసుకుపోగా అక్కడ చికిత్స పొందుతూ అక్టోర్‌ 10వ తేదీన 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ సోమవారం మరో మహిళ మృతిచెందింది. అదే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు సదరు వంటకం రుచి నచ్చక దాన్ని తినటం మానేయటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై ‘హీలాంగ్జియాంగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌’కు చెందిన ఫుడ్‌ సేఫ్టీ డైరెక్టర్ గావో పీయ్‌ మాట్లాడుతూ.. ‘‘ బాంగ్‌క్రెక్‌ అనే విషం కారణంగానే వారు మృత్యువాత పడ్డారు. చెడిపోయిన పదార్థాలలో అది ఎక్కువగా ఉంటుంది. ( ఏనుగును కి.మీ. ఈడ్చుకెళ్లిన రైలు ఇంజన్‌ సీజ్‌ )

బాంగ్‌క్రెక్‌ మన శరీరంలోకి చేరిన వెంటనే ప్రభావం చూపుతుంది. కడుపునొప్పి, చెమట పడ్డటం, నీరసం, కోమా.. 24 గంటల్లో మరణం కూడా సంభవించవచ్చు. ఆ విషం మన శరీరంలోని కీలక అవయవాలైన కిడ్నీలు, లివర్‌, గుండె, బ్రెయిన్‌ను దెబ్బ తీస్తుంది. ప్రస్తుతం దానికి విరుగుడు మందు లేదు. ఒక సారి ఆ విషం మన శరీరంలోకి చేరితే చనిపోయే అవకాశాలు 40-100 శాతం వరకు ఉన్నాయి. మనం ఎంత వేడి చేసినా బాంగ్‌క్రెక్‌ నశించదు. అది కొబ్బరి పదార్థాలను ఎక్కువ రోజులు పులియబెట్టడం వల్ల ఉత్పత్తి అవుతుంది. అందుకే ఇండోనేషియన్‌ సంప్రదాయ వంటకం ‘టెంపె బాంగ్‌క్రెక్‌’ను నిషేధించార’’ని తెలిపారు.

మరిన్ని వార్తలు