ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో నలుగురు అరెస్ట్‌

4 Aug, 2021 23:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు నలుగురిని బుధవారం అరెస్ట్‌ చేశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బాలరవికుమార్‌ సహా ఓమ్ని ఎంటర్‌ ప్రైజెస్‌ యజమాని కంచర్ల శ్రీహరి, ఓమ్ని హెల్త్‌ కేర్‌ యజమాని కంచర్ల సుజాత, మేనేజర్‌ వెంకటేశ్వర్లును అరెస్ట్‌ చేశారు. వైద్య పరికరాలు, మెడికల్ కిట్లను 50 నుంచి 400 శాతం అధిక రేట్లకు విక్రయించినట్లు సీబీఐ నిర్థారించింది. ప్రభుత్వ ఖజానాకు రూ.35 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సీబీఐ అధికారులు నిర్థారించారు. అరెస్ట్‌ చేసిన నలుగురునీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు