కీస‌ర : న‌లుగురు నిందితుల క‌స్ట‌డీకి అనుమ‌తి

24 Aug, 2020 15:35 IST|Sakshi

సాక్షి, మేడ్చ‌ల్ :  కీస‌ర త‌హ‌శీల్దార్ అవినీతి కేసులో న‌లుగురు నిందితుల క‌స్ట‌డీకి ఏసీబీ కోర్టు అనుమ‌తించింది. రేప‌టి నుంచి మూడు రోజుల పాటు నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారించ‌నున్నారు. నిందితులు  నాగరాజు, శ్రీనాథ్, అంజిరెడ్డి, విఆర్ఏ సాయిరాజులు ప్ర‌స్తుతం చంచ‌ల్ గూడ జైళ్లో ఉన్నారు.  రియల్టర్‌ అంజిరెడ్డి వద్ద ఏసీబీ సోదాల్లో రేవంత్‌రెడ్డి ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు తెలుస్తోంది. కలెక్టర్ ఆఫీసులో ఉండాల్సిన పలు పత్రాలు కూడా అంజిరెడ్డి వద్ద లభ్యమమైనట్టు స‌మాచారం.  (కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!)

దీంతో దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఏసీబీ అధికారులు  సేక‌రిస్తున్నారు. నిందితులు నాగ‌రాజు, అంజిరెడ్డి నివాసాలు, కార్యాల‌యాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించగా ప‌లు  ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా నిందితులకు సహకరించిన వారి వివ‌రాల‌ను ఏసీబీ అధికారులు సేక‌రిస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలో ఎమ్మార్వో నాగ‌రాజు ఇంట్లో నుంచి కొన్ని డాక్యుమెంట్లను మాయం చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు లాక‌ర్ల తాళాల‌ను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త‌హ‌శీల్దార నాగ‌రాజు స‌మ‌క్షంలో బ్యాంకు లాక‌ర్‌ను తెర‌వ‌నున్నారు. ఈ నెల 25 నుండి 27 వరకు ఏసీబీ క‌స్ట‌డీ నేప‌థ్యంలో మ‌రిన్ని కీల‌క విషయాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. (బ‌య‌ట‌ప‌డుతున్న కీస‌ర ఎమ్మార్వో అక్ర‌మాలు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా