ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు బిగ్‌ షాక్‌

12 Oct, 2023 20:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చాలని పేర్కొంది.

ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు అనంతరం పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

అడ్డగోలుగా అవినీతి..
టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధు­లతో చేపట్టిన ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్ని­హి­తు­డైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్‌’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది.

చంద్ర­బాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టి­పెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టు­బడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు.

నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘన..
ఫైబర్‌ నెట్‌ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్ట­బెట్ట­డం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పర­స్పర ప్రయో­జ­నాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియ­మి­ం­చారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ– గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించ­డంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్‌ నెట్‌ టెండర్ల మదింపు కమిటీ­లోనూ సభ్యుడిగా నియ­­మించారు.
చదవండి: లోకేష్‌ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు 

మరిన్ని వార్తలు