కీసర భూదందాలో రాజకీయ హస్తం!

15 Aug, 2020 18:58 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: కీసర భూదందా కేసులో​ రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి చెందిన ప్రముఖ నేత సోదరుడి హస్తం ఉందంటూ తమ గ్రామంలో పలుమార్లు సదరు నేత సోదరుడు తిరిగాడంటూ రైతులు ఆరోపణలు చేస్తున్నారు. దయార గ్రామంలోని కొందరితో కలిసి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని అన్నారు. కీసర భూదందాలో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. తహశీల్దార్‌ నాగరాజు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అంజిరెడ్డి నుంచి కీలక సమాచారాన్ని ఏసీబీ అధికారులు సేకరించారు. విచారణలో భాగంగా అంజిరెడ్డి నివాసంలో ఓ ప్రజా ప్రతినిధికి చెందిన లేఖలు స్వాధీనం చేకున్నారు. (నాగరాజు ఇంటిలో కొనసాగుతున్న సోదాలు)

గతంలో సదరు ప్రజా ప్రతినిధి ఆర్టీఐ కింద భూముల సమాచారం కోరుతూ తహశీల్దార్‌కు రాసిన లేఖలు స్వాధీనం చేసుకుకున్నారు. సదరు ప్రజా ప్రతినిధితో అంజిరెడ్డికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ​ఆ ప్రజా ప్రతినిధి గత ఏడాది తన ఎంపీ ల్యాడ్స్‌ నిధులను విడుదల చేస్తూ మేడ్చల్‌ కలెక్టర్‌కు రాసిన లేఖలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. కోటి 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. (ఒక్కొక్కటిగా వెలుగులోకి నాగరాజు అక్రమాలు)

మరిన్ని వార్తలు