మెదక్ ఏసీబీ కేసులో దర్యాప్తు ముమ్మరం...

10 Sep, 2020 15:31 IST|Sakshi

సాక్షి, మెదక్‌ : మెదక్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌కు సంబంధించిన కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అయిదుగురు నిందితులను అరెస్టు చేసి వారిని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అయిదుగురు నిందితులను అధికారులు విచారిస్తున్నారు. ఉన్నతాధికారి పాత్రతో పాటు కింది స్థాయి ఉద్యోగుల పాత్రపై నిందితులను నుంచి వివరాలు సేకరిస్తున్నారు. (మరో 'కోటి'గారు దొరికారు!)

స్టాంప్ అండ్ రీజిస్టేషన్‌కు రాసిన లేఖతో మాజీ కలెక్టర్ పాత్రపై ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ కలెక్టర్ రిటైర్మెంట్ రోజునే స్టాంప్ అండ్ రీజిస్టేషన్‌కు లేఖ రాయడంతో మాజీ కలెక్టర్ పై అనుమానాలు బలవపడుతున్నాయి. అరెస్ట్ చేసిన అయిదుగురు నిందితులను ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు. (మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ అరెస్ట్)‌

>
మరిన్ని వార్తలు