ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్‌: బాంబులు పేల్చి సంబరాలు

24 Mar, 2021 19:42 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లా వేంసూర్ తహశీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ రైతు నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్‌లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. సత్తుపల్లికు చెందిన తోట సాంబశివరావు అనే రైతు తనకు వేంసూర్ మండలంలో ఉన్న 25 ఎకరాల వ్యవసాయ భూమికి సంభందించి సర్వే నిమిత్తం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సర్వే చేయటం కోసం వేంసూర్ సర్వేయర్ గుర్వేశ్, డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్‌లు దరఖాస్తుదారుడిని రెండు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు.

లక్షన్నరకు బేరం కుదరటంతో నేడు తహశీల్దార్ కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తోట సత్యనారాయణ అనే రైతు పిర్యాదు మేరకు తహశీల్దార్ కార్యాలయంపై దాడి చేసిన అధికారులు లంచం తీసుకుంటున్న ఉపేందర్, సర్వేయర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా డిప్యూటీ తహసీల్దార్ సహా సర్వేయర్ అడ్డంగా బుక్కయ్యారని తెలియడంతో పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. అవినీతి అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు.

చదవండి: లంచం అడిగే.. అడ్డంగా దొరికిపాయే..
జైలు నుంచి వచ్చి, రహస్యంగా పెళ్లిచేసుకున్న హీరోయిన్‌ 

మరిన్ని వార్తలు