బీఫార్మసీ విద్యార్థి తేజస్విని మృతి కేసు.. ప్రియుడు అరెస్ట్‌

9 May, 2022 11:22 IST|Sakshi

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలో సంచలన కలిగించిన బీఫార్మసీ విద్యార్థి తేజస్విని మృతి కేసులో నిందితుడు సాధిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సాధిక్ ఆలియాస్ బాబూలాల్ వేధింపుల వల్లే తేజశ్విని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న పోలీసులు.. అతనిపై 420, 376, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణ బాధ్యతలు దిశ పోలీసులకు అప్పగించామని.. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు.
చదవండి: పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి.. 

మరిన్ని వార్తలు